Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెద ప్రభునకే Telugu Christian Song Lyrics

పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెద ప్రభునకే Lyrics

పూర్ణ హృదయ స్తోత్రముల్ - చెల్లించెద ప్రభునకే (2)
1. ఏర్పరచుకోలేదు నేను - ప్రభువే నన్నేర్పరచుకొనెన్ (2)
పాపినైన నాకు - ఆయనే రక్షణ నిచ్చెన్ (2)
పరలోక రాజ్యములో - భాగమునిచ్చెన్ (2)
2. నా హృదయ పాపమును - తన రక్తములో కడిగెన్
మృతమైన నా ఆత్మను - జీవింపజేసె ప్రభువు
ఉచితంబుగానే పొందితి - నిత్య జీవం
3. నే పాప బంధములో నుండ - హృదయమశాంతితో నిండె
నా పాప మొప్పుకొనగా - కడిగెను రక్తములో
శాంతి ఆనందముతో - నన్ను నింపెన్
4. వర్ణింపజాలను నేను - ప్రభు యొక్క గొప్ప ప్రేమన్
పాపిని నను ప్రేమించెన్ - మరువలేనా ప్రేమను
ప్రశంసలను పాడెద - ప్రభుకే
5. నిత్య రాజ్యము నన్ను చేర్చ - నిత్య నిబంధన చేసే
సుఖదుఃఖములందైన - ముగింతు నా పరుగున్
స్థిరముగ నుందు పరమును చేరువరకు


Your favourites

  • No Favourites found!