Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పోరాటం ఆత్మీయ పోరాటం (2) చివరి Telugu Christian Song Lyrics

పోరాటం ఆత్మీయ పోరాటం (2) చివరి Lyrics

పోరాటం ఆత్మీయ పోరాటం (2)
చివరి శ్వాస వరకు – ఈ పోరాటం ఆగదు
సాగిపోవుచున్నాను
సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి (2)

నా యేసుతో కలిసి పోరాడుచున్నాను
అపజయమే ఎరుగని జయశీలుడాయన (2)
నా యేసు కొరకే సమర్పించుకున్నాను (2)
ఆగిపోను నేను సాగిపోవుచున్నాను          ||పోరాటం||

నా యేసు వెళ్ళిన మార్గము లేనని
అవమానములైనా ఆవేదనలైనా (2)
నా యేసు కృపనుండి దూరపరచలేవని (2)
ఆగిపోను నేను సాగిపోవుచున్నాను          ||పోరాటం||

ఆదియు అంతము లేనివాడు నా యేసు
ఆసీనుడయ్యాడు సింహాసనమందు (2)
ఆ సింహాసనం నా గమ్యస్థానం (2)
ఆగిపోను నేను సాగిపోవుచున్నాను          ||పోరాటం||

Your favourites

  • No Favourites found!