పోయెఁగ పోయెఁగ కాలము వెళ్లి పోయెఁగ పోయెఁగ మాయ
సంసార సం పదఁ గూర్ప మరిగి యాయు వంతయు వ్యర్థ మైపోయెఁ
దరిగి ||పోయెఁగ||
1. ఇలలో నెందరు నీతో నీడైనవారు కలఁ గాంచి మేల్కొన్న గతి
మడసినారు ||పోయెఁగ||
2. జల బుద్భుదము కంటె చులకని బ్రదుకు దలపోసి దీని యా శలు
గొయ్యి వెదకు ||పోయెఁగ||
3. ఎన్నాళ్ళు సుఖ పెట్టె నెరవౌ నీ మేను కన్ను మూసిననాఁడె కాటి
పాలౌను ||పోయెఁగ||
4. మద మత్సరముల వెం బడి గూడి నీవు హృదయాభిమానము వదలు
కొన్నావు ||పోయెఁగ||
5. చెడు దుర్గుణముల పో షించుట విడువ గడబాట్లు నీ కనులు
గానంగలేవ ||పోయెఁగ||
6. జవ్వన బలముచే క్రొవ్వుచు నీవు నవ్వులాటల ప్రొద్దు నడిపి యున్నావు
||పోయెఁగ||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
పోయెఁగ పోయెఁగ కాలము వెళ్లి పోయెఁగ Lyrics
Your favourites
- No Favourites found!
