Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ప్రాణమా నా ప్రాణమా ప్రియ యెహోవాను Telugu Christian Song Lyrics

ప్రాణమా నా ప్రాణమా ప్రియ యెహోవాను Lyrics

ప్రాణమా నా ప్రాణమా
ప్రియ యెహోవాను సన్నుతించుమా
ప్రియ యెహోవా చేసిన మేలులను
నీవు ఎన్నడు మరువకుమా ||ప్రాణమా||

గత కాలములన్నిటిలో
కృపతోనే నడిపించెను (2)
కరుణ కటాక్షమనే (2)
కిరీటం నీకు దయచేసెను (2) ||ప్రాణమా||

నిను విడువక ఎడబాయక
నిత్యం నీకు తోడైయుండెను (2)
నీవు నడిచిన మార్గములో (2)
నీకు దీపమై నిలచెనుగా (2) ||ప్రాణమా||

పాప శాపము వ్యాధులను
పారద్రోలియే దీవించెను (2)
పరిశుద్ధుడు పరమ తండ్రి (2)
బలపరిచెను తన కృపతో (2) ||ప్రాణమా||

మహా ఆనంద మానందమే
మహారాజా నీ సన్నిధిలో (2)
మహిమగల మహారాజా (2)
మనసారా స్తుతించెదను (2) ||ప్రాణమా||

Your favourites

  • No Favourites found!