Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ప్రార్ధన యేసుని సందర్శన పరమ తండ్రితో Telugu Christian Song Lyrics

ప్రార్ధన యేసుని సందర్శన పరమ తండ్రితో Lyrics

ప్రార్ధన యేసుని సందర్శన
పరమ తండ్రితో సంభాషణ

కరములెత్తి ప్రార్ధించగా
పరమ తండ్రి కౌగిలించును
స్వరమునెత్తి ప్రార్ధించగా
మధుర స్వరముతో మాటాడును          ||ప్రార్ధన||

తండ్రి అని నే పిలువగా
తనయుడా అని తా బల్కును
ఆదుకొనును అన్ని వేళలా
కన్నీరంతయు తుడిచివేయున్          ||ప్రార్ధన||

మోకరించి ప్రార్ధించగా
సమీపముగా వేంచేయును
మనవులెల్ల మన్నించును
మహిమతో నలంకారించును          ||ప్రార్ధన||

కుటుంబముతో ప్రార్ధించగా
కొదువ ఏమియు లేకుండును
ఐక్యతలో నివసించును
శాశ్వత జీవము అచటుండును          ||ప్రార్ధన||

సంఘముగను ప్రార్ధించగా
కూడిన చోటు కంపించును
పరిశుద్ధాత్ముడు దిగివచ్చును
ఆత్మ వరములతో నింపును          ||ప్రార్ధన||

ఉపవాసముతో ప్రార్ధించగా
కీడులన్నియు తొలగిపోవును
కొట్లు ధాన్యముతో నింపును
క్రొత్త పానము త్రాగించును          ||ప్రార్ధన||

ఏకాంతముగా ప్రార్ధించగా
నీతిని నాకు నేర్పించును
యేసు రూపము నాకిచ్చును
యేసు రాజ్యము నను చేర్చును          ||ప్రార్ధన||

Your favourites

  • No Favourites found!