Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖము Telugu Christian Song Lyrics

ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖము Lyrics

ప్రార్థించుము నీ జీవితములో - నెమ్మది సుఖము లొందెదవు (2)
సంపూర్ణ భక్తిని కలిగించును - క్షేమములెన్నో పొందెదవు
1. యెడతెగక నీవు ప్రార్థించినా - విసుగక నీవు ప్రార్థించినా (2)
సమస్తమును నీవు పొందెదవు - తప్పక న్యాయము పొందెదవు (2)
నీ కొరకై ప్రభు వేచియున్నాడు - ప్రార్థనలో కనిపెట్టుము (2)
2. కష్టము నష్టము కలిగినను - శోధన బాధలు వచ్చినను
సాతాను నీపై విజృంభించి - నిన్ను గాయపరచినను
భయపడకుము ప్రభువే నీకు - జయము నిచ్చును
3. ప్రభువే మనతో సెలవిచ్చెను - మెళకువగా నుండి ప్రార్థించు మని
విశ్వాసము కోల్పోయే దినములలో - విశ్వాసముతో ప్రార్థించినా
సాతాను దుర్గములను పడగొట్టి - బలము పొందెదవు
4. ప్రభువచ్చు వేళాయే గమనించుము - ఆత్మ వలన ప్రతి విషయములో
ప్రార్థన విజ్ఞాపన చేయుచు - పూర్ణమైన పట్టుదలతో
పరిశుద్ధుల కొరకై విజ్ఞాపనము చేయుచు - మెళకువగా నుండుడి
5. యెరూషలేము క్షేమముకై - అన్యజనుల రక్షణకై
భారముతో నీవు ప్రార్థించిన - ప్రభువే నీకు ఫలమిచ్చును
వారి క్షేమమే నీ క్షేమమునకు - ఆధారమగును


Your favourites

  • No Favourites found!