Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ప్రభు దయచేయు నిత్య దీవెనలు బెరాకాలో Telugu Christian Song Lyrics

ప్రభు దయచేయు నిత్య దీవెనలు బెరాకాలో Lyrics

ప్రభు దయచేయు - నిత్య దీవెనలు బెరాకాలో చూతురు
1. కీడు, యుద్ధము, తెగులు, కరువైనను
దాడి చేయబూని విజృంభించి నపుడు
నీవు మొరపెట్టిన నీకు దొరుకు - నిజముగా - రక్షణ
2. శత్రు శోధనలు పై బడినప్పుడు
శక్తిహీనులమై పోయినప్పుడు
క్రీస్తు దయచేయు నిత్యాదరణ - నిజముగా - చూతురు
3. ప్రభు యుద్ధము చీయు నాయకుడు
ప్రభు పక్షమందు చీరుము యీనాడే
నీవు పొందెదవు బెరాకాలో - నిజముగా - జయము
4. పలువిధ శ్రమలందు చేరుమా
ప్రీతిమీర మిమ్ము దరిచేర్చును
నీతియుక్తముగా స్తుతించుము - ఖ్యాతితో ప్రభుని
5. నిత్యదేవుని మహాకృప నిరతం
శత్రువును జయించును నిశ్చయం
కృతజ్ఞతా స్తుతులు మీరు - నిత్యముగా చెల్లించుడి
6. స్వరమండల సితారా వాయించుడి
శత్రువులతో ప్రభు పోరుసల్పెను
బెరాకాలో ప్రభు స్వరమెత్తి - మరి మరి - పాడుడి
7. పరమ తండ్రి ప్రసాదించు నెమ్మది
భూరాజులు గడగడ వణికిరి
తన ప్రజలను సంతోషపరచును - హల్లెలూయ - పాడుడి


Your favourites

  • No Favourites found!