Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనముత్సహించెదము Telugu Christian Song Lyrics

ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనముత్సహించెదము Lyrics

ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనముత్సహించెదము
ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించె నహా
అను ఆహా స్తోత్రము స్తోత్రములు - ఇంతవరకు కాచె
పాత్రులముగా సేవింతుము
1. దైవ కార్యములు జనముల మధ్య - ప్రసిద్ధి చేయుదము
దేవుని ఆశ్చర్య కార్యము మనలో - ధ్యానించి పాదెదము
2. సంగీత గానములతోను - సన్నుతించుచు ప్రభుని
సితార స్వరమండలములతో - మన మార్భాటించెదము
3. మన భారములన్నియు తొలగించె - ఘనకార్యములను జేసె
దినమెల్ల పాడుచు ఘనపరచెదము - చాటించెద మిలలో
4. నూతన కార్యములు చేయువాడు - ప్రభు వాశ్చర్యకరుడు
బలమగు కార్యములు చేయువాడాయనే ధైర్యముగా పాడెదం
5. ప్రేమా సౌందర్యములు గలవాడు - క్షేమము నిచ్చువాడు
మహిమైశ్వర్యములు గలవాడాయనే మహిని బొగడెదము
6. మనకెన్నో వాగ్దానము లిచ్చె మన మనుభవించితిమి
ఘనతా మహిమ ప్రభావము ప్రభునకే హల్లెలూయా ఆమెన్


Your favourites

  • No Favourites found!