ప్రభుక్రీస్తు యేసు ప్రేమించె సంఘమును పరిమళ వాసనగానుండ
ప్రభువు చిత్తమును పరిగణించుటయె సంఘము నీ బాధ్యతగాదా! ||ప్రభు||
1. దేవుడిచ్చు బహుమానమె బిడ్డలు గర్భఫలమె మన కిడు స్వాస్థ్యం ఇంపుగ
ప్రతిష్టింపను వారిని సంఘమ నీ బాధ్యతగాదా? ||ప్రభు||
2. యువకులు రేపటి సంఘము నందున నాయుకు లౌదురు నయముగను
పావనులుగ నిలఁ జేయను వారిని సంఘము నీ బాధ్యత గాదా? ||ప్రభు||
3. బాప్తిస్మమును కృపా ప్రసాదములు ప్రభు వెంచెను పరిశుద్ధముగ ఘనముగ
వాటిని గైకొన నిరతము సంఘము నీ బాధ్యతగాదా! ||ప్రభు||
4. దేవుడు జతపర్చిన దాంపత్యము భావములర బంధుత్వములున్
సవ్యంబుగసరి జేయఁగ వాటిని సంఘ మ నీ బాధ్యతగాదా? ||ప్రభు||
5. పామర జనములు ప్రభు నెఱుంగక పెడ మార్గంబుల దిరుగగను
మానుగ రక్షణ మార్గము జూపుట సంఘ మ నీ బాధ్యతగాదా? ||ప్రభు||
6. క్రైస్తవ దాతృత్వము నందెదుగుట కర్తను కీర్తించుట యౌను దశమ
భాగములు దాత కొసంగను సంఘ మ నీ బాధ్యత గాదా? ||ప్రభు||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ప్రభుక్రీస్తు యేసు ప్రేమించె సంఘమును పరిమళ Lyrics
Your favourites
- No Favourites found!
