Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ప్రభు మార్గములయందె భయభక్తి నిందు శుభరీతి Telugu Christian Song Lyrics

ప్రభు మార్గములయందె భయభక్తి నిందు శుభరీతి Lyrics

ప్రభు మార్గములయందె భయభక్తి నిందు శుభరీతి నడిచే పురుషుండే
ధన్యుండు ||ప్రభు||

1. అపుడు నీచే కష్టం బారగించుదువు ఎపుడు ధన్చుడవు నీ కిలమేలౌ
గాక ||ప్రభు||

2. నెలవు ప్రక్కలనున్న సఫలమౌ ద్రాక్షతీ గెల పోలి నీ భార్య ఫలమిచ్చును
గాక ||ప్రభు||

3. పిల్లలిప్ప మొక్క పెంపువలె నీదు బల్లజుట్టుకొని శో భిల్లుదురు గాక
||ప్రభు||

4. ప్రభున కిదిగో భీతి పడువాడీరీతి విభవంపు దయనొంది
వికసించునుగాక ||ప్రభు||

5. ప్రభు సీయోనునుండి ప్రశస్త కృపను ప్రబలంబుగా నిచ్చి
బ్రతికించునుగాక ||ప్రభు||

6. అరయ బ్రతికెడు రోజు లన్నిట నీవు యెరుషలేము క్షేమంబు నెపుడు
జూచెదవు ||ప్రభు||

7. నీదు పిల్లల పిల్లలు నిజామిశ్రాయేలు మీది క్షేమముజూచి
మోదమొందెదరు ||ప్రభు||

8. తండ్రి కుమార శుద్ధాత్మునకు మహిమ మెండై యుగయుగములం
దుండుగా కామేన్ ||ప్రభు||

Your favourites

  • No Favourites found!