Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ప్రభు ప్రజలారా రయమున రండి యాకోబు Telugu Christian Song Lyrics

ప్రభు ప్రజలారా రయమున రండి యాకోబు Lyrics

ప్రభు ప్రజలారా - రయమున రండి
యాకోబు వంశమా - స్వకీయ జనమా
యెహోవా వెలుగులో - నడుతము రండి
1. అంత్య దినములందు - పొంతన లేనట్టి
మందిర పర్వత - శోభను గాంచగ
ఉన్నత పర్వత - శిఖరమందుండి
మహిమతో యిమ్మహి - వర్థిల్లును
2. యెహోవా మందిర - మందున బోధించు
హితబోధను విని - తన త్రోవ నడువగ
యాకోబు దేవుని - నివాసమునకు
పంక్తులై జనులు - పరుగిడి వత్తురు
3. యెహోవా వంతు ఆయన జనమే
యాకోబే తన - స్వాస్థ్యం బాయెన్
భీకర యెడారిలో - కనుగొనె వానిని
ఎంచెను కాచెను - కనుపాపగను
4. కమనీయంబగు - కలకని యాకోబు
గాంచెను నిచ్చెనన్ - భువినుండి దివికి
నిలువగ యెహోవా - దానికి పైగా
బేతేలే యిది - వేరేది కాదనెన్
5. దేవుని మందిర - ప్రత్యక్షతలు
సజీవ్ సంఘ - మందున నింపెన్
సత్యమునకు నిది - ఆధారమును
స్తంభము గానై - స్థిరముగ నుండెను
6. నూతనమైనట్టి - యెరూషాలే మది
నిత్య దేవుని - నివాసమాయె
భక్తులు చేరి - ప్రస్తుతింపగ
స్తుతులకు మధ్యను - ప్రభవించును ప్రభు
7. కుక్కలు మాంత్రికులు - వ్యభిచారులును
నరహంతకులును - విగ్రహారాధికులు
అబద్ధమును ప్రేమించి - జరిగించు
ప్రతివాడునట - వెలుపట నుందురు
8. సర్ప సంతానము నుండి - వేరైనవారై
క్రీస్తుని రక్తమున్ - కోరి వేడినచో
స్వకీయ ధనమౌ - యాకోబు వంశమై
కీర్తింతురు ప్రభున్ - హల్లెలూయ


Your favourites

  • No Favourites found!