Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ప్రభు యేసుక్రీస్తుని దర్శనమే నేడు ప్రజలందరి Telugu Christian Song Lyrics

ప్రభు యేసుక్రీస్తుని దర్శనమే నేడు ప్రజలందరి Lyrics

ప్రభు యేసుక్రీస్తుని దర్శనమే నేడు
ప్రజలందరి కత్యవసరము ఆ ఆ
అను దర్శనము లేక ప్రజలు నశింతురు
దీనినక్కరతో గమనించెదము
1. యెషయాచూచె సైన్యముల యెహోవాను
ఉజ్జియా మరణించినపుడు ఆ ఆ
యెహోవా పరిశుద్ధుడని ముమ్మారు
దూతల గొప్ప ద్వని వినెనపుడు
2. యెహెజ్కేలుకు అధిపతివలె కనబడె
నా భాగ్యమెవరికి లేదా ఆ ఆ
నాళు ముఖములతో నాలుగు జీవులు
కన్నులతో నిండియున్న చక్రములు
3. శాశ్వత రాజ్యములు కల్గిన రాజును
అగ్నివంటి సింహాసనమున్ ఆ ఆ
కోట్లకొలది జనులు తీర్పునకై
కాచియుండుట చూచెను దానియేలు
4. కొండపై యేసు రూపాంతర మొందిన
సందర్భము మరువగలమా ఆ ఆ
భయ మొందిరచ్చట ముగ్గురు శిష్యుల్
ప్రియసుతుని గూర్చి తండ్రి జెప్పగనె
5. పత్మాసు ద్వీపమున యోహానుజూచిన
ప్రభువే సంఘమునకు శిరస్సు ఆ ఆ
మహా ప్రధాన యాజకుడాయనే
మహిమ ప్రభావ రూపుడు యేసే
6. సిణాసనము మధ్యలో నున్నవాడే
సింహమగు దైవ గొఱ్ఱెపిల్ల ఆ ఆ
ఆరాధింపబడు దేవుడు నాయనే
అందరి యారాధన లాయనకే
7. తెల్లని యశ్వముపై నున్న వీరుడు
నమ్మకమగు సత్యరూపి ఆ ఆ
దేవుని వాక్యము న్యాయాధీపతియగు
జీవుల దేవునికే హల్లెలూయ


Your favourites

  • No Favourites found!