Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ప్రభు యేసు నా రక్షకా నొసగు Telugu Christian Song Lyrics

ప్రభు యేసు నా రక్షకా నొసగు Lyrics


ప్రభు యేసు నా రక్షకా
నొసగు కన్నులు నాకు
నిరతము నే నిన్ను జూడ (2)
అల్ఫయు నీవే – ఒమేగయు నీవే (2)          ||ప్రభు యేసు||

ప్రియుడైన యోహాను పత్మాసులో
ప్రియమైన యేసు నీ స్వరూపము (2)
ప్రియమార జూచి బహు ధన్యుడయ్యె
ప్రియ ప్రభు నిన్ను జూడనిమ్ము (2)          ||ప్రభు యేసు||

లెక్కలేని మార్లు పడిపోతిని
దిక్కులేనివాడ నేనైతిని (2)
చక్కజేసి నా నేత్రాలు దెరచి
గ్రక్కున నిన్ను జూడనిమ్ము (2)             ||ప్రభు యేసు||

ఎరిగి యెరిగి నే చెడిపోతిని
యేసు నీ గాయము రేపితిని (2)
మోసపోతి నేను దృష్టి దొలగితి
దాసుడ నన్ను జూడనిమ్ము (2)             ||ప్రభు యేసు||

ఎందరేసుని వైపు చూచెదరో
పొందెదరు వెల్గు ముఖమున (2)
సందియంబు లేక సంతోషించుచు
ముందుకు పరుగెత్తెదరు (2)             ||ప్రభు యేసు||

విశ్వాసకర్తా ఓ యేసు ప్రభూ
కొనసాగించువాడా యేసు ప్రభూ (2)
వినయముతో నేను నీ వైపు జూచుచు
విసుగక పరుగెత్త నేర్పు (2)             ||ప్రభు యేసు||

కంటికి కనబడని వెన్నియో
చెవికి వినబడని వెన్నియో (2)
హృదయ గోచరము కాని వెన్నియో
సిద్ధపరచితివ నాకై (2)                 ||ప్రభు యేసు||

లోక భోగాలపై నా నేత్రాలు
సోకకుండునట్లు కృప జూపుము (2)
నీ మహిమ దివ్య స్వరూపమును
నిండార నను జూడనిమ్ము (2)          ||ప్రభు యేసు||

Your favourites

  • No Favourites found!