Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ప్రభుకే స్తోత్రము మృతిని గెల్చెను ప్రభు Telugu Christian Song Lyrics

ప్రభుకే స్తోత్రము మృతిని గెల్చెను ప్రభు Lyrics

ప్రభుకే స్తోత్రము మృతిని గెల్చెను
ప్రభు యేసు యెల్ల వేళ విజయ మిచ్చును
ఘన విజయమిచ్చును (2)

ఓ సమాధి విజయమేది మరణమా ముల్లెక్కడ
మ్రింగె జయము మరణమున్ ఫలించె సత్యవాక్యము (2)
జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం      ||ప్రభు యేసు||

దైవజన్మ మొందువారె లోకమున్ జయింతురు
లోకమున్ జయించు విజయమే మన విశ్వాసము (2)
జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం      ||ప్రభు యేసు||

శ్రమయు బాధ హింసలైన కరువు వస్త్రహీనతల్
క్రీస్తు ప్రేమనుండి మనల నేదియు నెడబాపదు (2)
జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం      ||ప్రభు యేసు||

అన్నిటిలో పొందెదము ఆయనతో విజయము
అధిక విజయ మొందెదం ప్రేమించు క్రీస్తు ద్వారనే (2)
జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం      ||ప్రభు యేసు||

జయము పొందువారెల్లరు తన రాజ్యవారసుల్
దేవుడే వారికి తండ్రి వారయన పుత్రులు (2)
జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం      ||ప్రభు యేసు||

Your favourites

  • No Favourites found!