Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ప్రభుని రాకడ ఈ దినమే పరుగులిడి Telugu Christian Song Lyrics

ప్రభుని రాకడ ఈ దినమే పరుగులిడి Lyrics

ప్రభుని రాకడ ఈ దినమే పరుగులిడి రండి సుదినమే
అను పరమునందుండి మన ప్రభువు - ధరకు నరుగును
పాలనకై - బూరశబ్దముతో - జనులారా
1. సిద్ధులగువారిన్ - మనయేసు - శుద్ధి జేయునిలన్ - పరమునకై
బుద్ధిహీనులను - శ్రమలచేత - బద్ధులుగ జేయున్ - వేదనతో
బాధ కలిగించున్ - సాతాను
2. స్వరముతో వచ్చున్ - అధికారి - మహిమతో మరలున్
తనదూత - సూర్యచంద్రునిలన్ తారలతో జీకటుల్ క్రమ్మున్
ప్రభురాక - పగలు రాత్రియగున్ - త్వరపడుము
3. మొదట లేతురు సజీవులై - ప్రభునియందుండు - ఆ మృతులు
మరల అందరము ఆ ధ్వనితో - పరము జేరుదుము - ధరనుండి
ధన్యులగుదుము - పరికించు
4. వెయ్యియేండ్లు పాలించెదరు ప్రియుని - రాజ్యమున
ప్రియులు, సాయం సమయమున - చేరి నెమలి కోకిలలు
రాజున్ - పాడి స్తుతించును - ఆ దినము
5. గొర్రె మేకలును - ఆ చిరుత సింహజాతులును ఒక చోట
భేధము లేక బరుండి గరిక మేయును - ఆవేళ
కలసి మెలగును - భయపడక
6. న్యాయ నీతులన్ - మన ప్రభువు ఖాయముగ దెల్పున్
ఆనాడు - సాక్షులుగ నిలుతుం అందరము - స్వామియేసునకు
ధ్వజమెత్తి చాటి యేసునకు - ఓ ప్రియుడా


Your favourites

  • No Favourites found!