ప్రభువా మమ్మునుదీవించి పంపుము నీ కృపనందించి అభినందన ములఁ
జేకొనుమా విభవము మహిమోన్నతి కీర్తి యుగయుగములకు నీకగుతన్
||ప్రభువా||
1. పగతురఁ బ్రేమించెడు శక్తిన్ తగఁబొరుగును జూచెడి రక్తిన్ మిగులందయ
చేయుము దైవ జగదేక కుమారా కీర్తి యుగయుగములకు నీ కగుతన్
||ప్రభువా||
2. గుడిలో వినిన నీవాక్యము మా గుండెలఁ బదిలము జేయఁగను
గుడిబయటను నా చారములో నడువగఁ దోడ్పడుమో కీర్తి యుగయుగము
లకు నీ కగుతన్ ||ప్రభువా||
3. క్రైస్తవ మైత్రిని సంఘములో విస్తరణము జేయఁగనిమ్ము నేస్తవ భావము
లోకములో నెరపఁగ దయఁగనుమో కీర్తి యుగయుగములకు నీ కగుతన్
||ప్రభువా||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ప్రభువా మమ్మునుదీవించి పంపుము నీ కృపనందించి Lyrics
Your favourites
- No Favourites found!
