ప్రభువా నిన్నారాధింపను జేరితిమి యుదయ శుభకాంతి ప్రభవింపఁగా
దేవా నేఁడు శుభకాంతి విరజిమ్మఁగా విభవముగను ప్రభాకరముగను
విరియు నీ తేజంబెలర్పఁగ నభి దనంబులఁగూడి భక్తిని యాత్మతో
సత్యంబుతోడను ||ప్రభువా||
1.
ఇరులుం గమ్మిననుండి యరుణోదయము దనుక నరిగాపు నీవే కాదా
దేవా రాత్రి యరిగాపు నీవేకాదా విరివిగా మా హృదయసీమల నెరసి
యుండిన చీఁకటులుఁబో దరిమి శాంతంబైన మనసుల దయఁబ్రసాదింపను
భజింతుము ||ప్రభువా||
2.
అనఘా నీ సాన్నిధ్యమున నుండఁగా మా దుర్శనసుల నరి కట్టుమో
దేవా మా దుర్శనసుల శుచి జేయుము వినయ భయ భక్తులుఁద
లిర్పగ వినుచు నీ వాక్యోపదేశము లనిశమును ధ్యానింపనాత్మను
బనిచి తుదకుఁ బ్రసన్నమగుము ||ప్రభువా||
3.
పనిపాటలలో మేమీ దినము నీ కే మహిమ నొనఁగూర్ప నడిపించుమో
దేవా నిన్నే ఘన పరచన్నడిపించుము తనువు శ్రమచేబడలినను మా
దారి దుర్గమమైన కనంబడ వనటఁజెందక నేది జేసినఁ బ్రభువు కొఱకని
చేయ నడుపుము ||ప్రభువా||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ప్రభువా నిన్నారాధింపను జేరితిమి యుదయ శుభకాంతి Lyrics
Your favourites
- No Favourites found!
