Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ప్రభువా నీ గొప్పతనము స్తుతికి యోగ్యము Telugu Christian Song Lyrics

ప్రభువా నీ గొప్పతనము స్తుతికి యోగ్యము Lyrics

ప్రభువా నీ గొప్పతనము - స్తుతికి యోగ్యము
అశక్యమైనది - వర్ణించలేమిల
1. సృష్టి గొప్పది అద్భుతమేగా - సంకల్పమెంతో వుత్తమము
మానవజాతి కొరకై ప్రభూ - సిద్దపరచె సమస్తము
నీదు పనులు నీ సామర్ధ్యము వర్ణించలేమిల
2. నీ రూపమున నరుని సృజించి - అధికారము నిచ్చితివి
క్రీస్తునందు నిర్దోషినిగా - నిలువబెట్ట గోరితివి
నీదు దయ నీ మంచితనము వర్ణించలేమిల
3. సృష్టిని చేసిన శక్తికంటె - పాపికి రక్షణ గొప్పది
నీ యొద్ద నున్న సర్వమిచ్చి - విలువగు ముత్యము కొన్నావు
నీ ఐశ్వర్యము నీ మహిమను వర్ణించలేమిల
4. నీకు మానవుడమూల్యము - నీవు ప్రేమించుచున్నావు
అందుకే నీ ప్రాణమర్పించి - రక్తము కార్చి రక్షించితివి
నీ అద్భుత ప్రేమ నీ కృప వర్ణించలేమిల
5. అద్భుతమైన నూతన సృష్టి - మానవునికి నిచ్చితివి
రాజులనుగ యాజకులుగ వారసులుగను చేసితివి
నీ రాజ్యము నీ ప్రభావము వర్ణించలేమిల
6. ఉల్లాసముతో సృష్టి మైమరచే - అద్భుత కార్యములను చూచి
సంతోషించి ఆరాధించిరి - నీవే సర్వమని చెప్పిరి
నీ ప్రభుత్వము నీదు సత్యము వర్ణించలేమిల


Your favourites

  • No Favourites found!