Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి Telugu Christian Song Lyrics

ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి Lyrics

ప్రభువా నీ పరిపూర్ణత నుండి
పొందితిమి కృపవెంబడి కృపను
1. ప్రభువైన యేసుక్రీస్తు - పరలోక విషయములో
ప్రతి ఆశీర్వాదమును - ప్రసాదించితివి మాకు
2. జనకా నీ వెన్నుకొనిన - జనుల క్షేమముజూచి
సంతోషించునట్లు - నను జ్ఞాపకముంచుకొనుము
3. నీదుస్వాస్థ్యమైనట్టి - నీ ప్రజలతో కలిసి
కొనియాడునట్లుగా - నను జ్ఞాపకముంచుకొనుము
4. దేవా నీ ప్రజల యెడల - దినదినము నీకున్న
ఘనుడా నీదు దయతో - నను జ్ఞాపకముంచుకొనుము
5. దేవా నీదు స్వరూప - దివ్యదర్శనమును
దినదినము నాకొసగి - నను జ్ఞాపకముంచుకొనుము
6. మీ మధ్యన నా ఆత్మ - ఉన్నది భయపడకు
డనిన మహోన్నతుడా - నను జ్ఞాపకముంచుకొనుము
7. ముదమార నన్నెన్నుకొని - ముద్ర యుంగరముగను
చేతుననిన ప్రభువా - నను జ్ఞాపకముంచుకొనుము
8. కృపా సత్య సమ్మిలిత - నంపూర్ణ స్వరూప
హల్లెలూయ నీకే ప్రభో - ఎల్లప్పుడు కలుగునుగాక


Your favourites

  • No Favourites found!