Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ప్రభువా నీదు ఘననామమున్ మేము పొగడిపాడ Telugu Christian Song Lyrics

ప్రభువా నీదు ఘననామమున్ మేము పొగడిపాడ Lyrics

ప్రభువా నీదు ఘననామమున్ మేము
పొగడిపాడ హృదయ ముప్పొంగెనే - యేసు
ప్రియుడా నీ పాద సన్నిధి చేర
నాలో నీదు ప్రేమ అధికంబాయనే
1. ఇహ పరము పొగడునట్టి ఘననామమే
ప్రేమ సత్యములు మారని నీ ఘననామమే
శ్రమలన్ని బాపునట్టి ఘననామమే
భక్తులెల్ల వేళ పొగడిపాడు ఘననామమే
2. కీడునంత తొలగించు ఘననామమే
వెదకువారికెల్ల ఔషధమా ఘననామమే
సకల మేళ్ళనిచ్చునట్టి ఘననామమే
ఈ ధరణి ప్రజలు కొనియాడు ఘననామమే
3. అపవాదిని తరిమినట్టి ఘననామమే
మమ్ము ప్రేమతోడ కౌగలించే ఘననామమే
పరిశుద్దులు పొగడునట్టి ఘననామమే
పరిశుద్దుల పరమున జేర్చు ఘననామమే


Your favourites

  • No Favourites found!