Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఎంతగ నిను కీర్తించినను – ఏమేమి Telugu Christian Song Lyrics

ఎంతగ నిను కీర్తించినను – ఏమేమి Lyrics

ఎంతగ నిను కీర్తించినను – ఏమేమి అర్పించినను (2)
నీ ఋణము నే తీర్చగలనా
తగిన కానుక నీకు అర్పింపగలనా (2)

ప్రభువా నిను కీర్తించుటకు వేనోళ్లు చాలునా
దేవా నీకు అర్పించుటకు పొట్టేళ్లు చాలునా (2)
ఎంతగ నిను కీర్తించినను – యేమేమి అర్పించినను (2)
నీ ఋణము నే తీర్చగలనా
తగిన కానుక నీకు అర్పించగలనా (2)     ||ప్రభువా||

కుడి ఎడమవైపుకు విస్తరింపజేసి
నా గుడారమునే విశాల పరచి (2)
ఇంతగ నను హెచ్చించుటకు
నే తగుదునా… నే తగుదునా…
వింతగ నను దీవించుటకు
నేనర్హుడనా… నేనర్హుడనా…      ||ప్రభువా||

నీ నోటి మాట నా ఊటగ నుంచి
నా జీవితమునే నీ సాక్షిగ నిలిపి (2)
ఇంతగ నను వాడుకొనుటకు
నే తగుదునా… నే తగుదునా…
వింతగ నను హెచ్చించుటకు
నేనర్హుడనా… నేనర్హుడనా…        ||ప్రభువా||

Your favourites

  • No Favourites found!