ప్రభువా పాడెద నొక స్తుతి గీతం - ప్రేమించి రక్షించితివి
1. గత వత్సరంబులోన - కాపాడి నడిపినావు
నూతన వత్సరమున - స్తుతియింప చేసినావు
2. యేసయ్య పలికితివి - ఆ సముద్ర పొంగులలో
నిశ్శబ్దముగా యూర - కొండుము నిమ్మళముగా
3. భయపడిన శిష్యులతో - రయమున పలికితివి
భయపడకుడి నేనే - ధైర్యము తెచ్చుకొనుడి
4. తుఫాను రేగె త్వరలో - తరంగములు లేచె
ఆపితివయ్యా దేవా - ఆపద బాపితివి
5. ముండ్లకు బదులు గొంజి - దేవదారులు మొలచు
ఉండును సూచనలుగా - నిత్యంపు ఖ్యతిగాను
6. అభివృద్ధి జేసెదవు - ప్రభువైన యేసు దేవా
అధికంబు మేలులతో - మునుపటి కంటె మరల
7. సిలువలో మా తుఫాను - బలిలో భరించితివి
హల్లెలూయ పాడెదను - కలువరి యేసు నాథా
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ప్రభువా పాడెద నొక స్తుతి గీతం Lyrics
Your favourites
- No Favourites found!
