Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ప్రభువైన క్రీస్తులో తండ్రి ప్రేమతో నిచ్చె Telugu Christian Song Lyrics

ప్రభువైన క్రీస్తులో తండ్రి ప్రేమతో నిచ్చె Lyrics

ప్రభువైన క్రీస్తులో తండ్రి - ప్రేమతో నిచ్చె - పరలోక దీవెనలు - విరివిగను
అను తెరువబడె - ఆకాశము మనకై
1. నీతి యావత్తును నెరవేర్చ క్రీస్తు - బాప్తిస్మమొందిన క్షణమందే
తెరువబడిన ఆకాశము నుండి - పరిశుద్ధ ఆత్మ దిగివచ్చె
2. మనుష్య కుమారుడు మహిమను నొందగ - పరలోక వార్తలు వివరింప
తెరువబడిన ఆకాశము నుండి - దూతలు ఎక్కుచు దిగుచుండె
3. దయ్యముల్ లోబడ సంతోషింపకు - నిజ సంతోషము ప్రభు తెలిపె
తెరువబడిన పరలోకము నందు - వ్రాయబడెను మీ పేరులనే
4. పాటింపకు నర భేదము లేవి - ధీటైన సంఘమర్మమని
తెరువబడిన ఆకాశము నుండి - పొందెను పేతురు దర్శనము
5. మేఘ ధనస్సున్న సింహాసనమున - తేజోమయుడై ప్రభువుండ
తెరువబడిన పరలోకము నందు - యెహోవాను గాంచె పరవశుడై
6. లేదిక చీకటి దీప కాంతియు - ప్రబువే వారికి వెలుగాయె
తెరుబడిన పరలోకమునందున - స్తుతి చెల్లింతురు పరిశుద్ధులు
7. నూతన సృష్టిలో నుండ నాశించిన - క్రీస్తులో తిరిగి జన్మించుము
జయించు వానిగా నీవుండినచో - రాజ్యము చేతువు క్రీస్తునితో


Your favourites

  • No Favourites found!