Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ప్రభువుగన్ ప్రతిష్టింపరే గృహమున క్రీస్తున్ ప్రభువుగా Telugu Christian Song Lyrics

ప్రభువుగన్ ప్రతిష్టింపరే గృహమున క్రీస్తున్ ప్రభువుగా Lyrics

ప్రభువుగన్ ప్రతిష్టింపరే గృహమున క్రీస్తున్ ప్రభువుగా ప్రతిష్టింపరె
విభవమొందగ నతని శుభమౌ నామము ధర సౌ రభమును వెదజల్లగ
ప్రబలమౌ ప్రేమన్ ప్రభుని యెడ గనపర్చరె ||ప్రభువు||

1. పూర్ణ ప్రేమను జూపరే గృహమున క్రీస్తును పూర్ణ ప్రేమను జూపరే
పూర్ణ హృదయముతోను పూర్ణయాత్మతో మరి ప్ర పూర్ణ శక్తితో జూపరే
క్రీస్తునిలో సం పూర్ణులగుటకు సాగరె ||ప్రభువు||

2. భక్తితోడను గొల్వరే గృహమున క్రీస్తున్ భక్తితోడను గొల్వరే ముక్తినాధుడు
తన స్వ రక్తమీయను మనకై రిక్తుడాయెను జూడరే ముక్తిదాతను నా
సక్తితో గొనియాడరే ||ప్రభువు||

3. నమ్మకస్థులై యుండరే గృహమున క్రీస్తుకు నమ్మకస్థులై యుండరే
అమ్మహాత్ముని నామ మిమ్మహిన్ దగజాటన్ నమ్మె మిమ్మును జూడరె
సమ్మతిన్ గ్రీస్తున్ నమ్మకంబుగ జాటరె ||ప్రభువు||

Your favourites

  • No Favourites found!