Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ప్రభువుకు తగినట్టు నడుచుకొందము రండి తన్ Telugu Christian Song Lyrics

ప్రభువుకు తగినట్టు నడుచుకొందము రండి తన్ Lyrics

ప్రభువుకు తగినట్టు - నడుచుకొందము రండి
తన్ రాజ్య మహిమకును - తగినట్టు నడుచుకొందము రండి
1. ఆదాము దేవుని, నిబంధనను మీరి - దారి తప్పిపోయెను - 2
హానోకు దేవునితో కూడ నడువగా - 2 తనతో నతనిని కొనిపోయెను
2. నోవహు దేవునితో కూడ నడిచె - కృప పొందినవాడై
తనతరములో నీతిమంతునిగా నెంచి - జలప్రళయమునుండి కాపాడెను
3. అబ్రాము దేవుని సన్నిధిలో నడిచె - నిందారహితునిగా
దేవుడతనితో, నిబంధనను చేసి - తన స్నేహితుడని ప్రకటించెను
4. దేవుని యింటి దర్శనము పొంది - ప్రజలను నడిపించెను మోషే
దేవుని యింటిలో నమ్మకమైన - వాడని ప్రభువే పలికెనుగా
5. దేవుని కట్టడల ననుసరించి - నడుచుకొనెను దావీదు
స్థిరపరచెనాతని సింహాసనమును - తన చిత్తానుసారుడని పలికెన్
6. పేతురు, యాకోవు, యోహానులు - ప్రభువును వెంబడించిరి
పరలోక సంఘ దర్శనమునిచ్చి - మనుజులను పట్టువారిగా చేసెన్
7. పునరుత్థానుడైన ప్రభువును గానక - ఎమ్మాయి కెళ్ళిరి శిష్యులు
యేసే వారితో కూడ నడిచెన్ - గద్దించి వారి కళ్ళు తెరిపించెను
8. వస్త్రములు అపవిత్రపరచుకొనని - కొందరుండిరి సార్దీసులో
అర్హులై తెల్లని వస్త్రము ధరించి - సంచరింతురు ప్రభుతో
9. యేసుని వెలుగులో నడుచుకొందము రండి - జీవముగల దేవుని సంఘమా
మన అతిక్రమములను ఒప్పుకొనెదము - యేసుతో కలిసి కొనసాగెదం


Your favourites

  • No Favourites found!