ప్రభుయేసు నా రక్షకా - నొసగు కన్నులు నాకు
నిరతము నే నిన్ను జూడ - అల్ఫయు నీవే - ఓమేగయు నీవే
1. ప్రియుడైన యోహాను పత్మాసులో
ప్రియమైన యేసూ - నీ స్వరూపము
ప్రియమార జూచి - బహు ధన్యుడయ్యె
ప్రియ ప్రభు - నిన్ను జూడనిమ్ము
2. లెక్కలేని మార్లు - పడిపోతిని
దిక్కులేనివాడ - నే నైతిని
చక్కజేసి నా - నేత్రాలు దెరచి
గ్రక్కున - నిన్ను జూడనిమ్ము
3. ఎఱిగి ఎఱిగి నే - చెడిపోతిని
యేసు నీ గాయము - రేపితిని
మోసపోతి నేను - దృష్టి దొలగితి
దాసుడ నన్ను - జూడనిమ్ము
4. ఎందరేసుని వైపు - చూచెదరో
పొందెదరు వెల్గు - ముఖమున
సందియంబు లేక - సంతోషించుచు
ముందుకు - పరుగెత్తెదరు
5. విశ్వాసకర్తా - ఓ యేసు ప్రభూ
కొనసాగించువాడా - యేసు ప్రభూ
వినయముతో నేను - నీవైపు జూచుచు
విసుగక - పరుగెత్త నేర్పు
6. కంటికి కనబడని - వెన్నియో
చెవికి వినబడని - వెన్నియో
హృదయ గోచరము - కాని వెన్నియో
సిద్ధపరచితివా - నాకై
7. లోక భోగాలపై - నా నేత్రాలు
సోకకుండునట్లు - కృపజూపుము
నీ మహిమ దివ్య - స్వరూపమును
నిండార నను - జూడనిమ్ము
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ప్రభుయేసు నా రక్షకా నొసగు కన్నులు Lyrics
Your favourites
- No Favourites found!
