Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ప్రజలమే వేగమె రారె నిజదైవమును కనుగొనరె Telugu Christian Song Lyrics

ప్రజలమే వేగమె రారె నిజదైవమును కనుగొనరె Lyrics

ప్రజలమే వేగమె రారె నిజదైవమును కనుగొనరె||

1. పాపాత్ములనబడు వారి భారంబు దీయనుగోరి
ప్రభుయేసు జూపినదారి పరమందు సుఖమిడుదారి ||ప్రజ||

2. ఏ జాతివారలనైనన్ యే దేశవాసులనైనన్
యేమైన బేధము లేక యేసయ్య బ్రోచునువేగ ||ప్రజ||

3. పాపాత్ములే తన సుతులు ప్రభు యేసునికి స్నేహితులు
నీ పాపమెల్లను బోయెన్ నీకింక మోక్షము కలుగున్ ||ప్రజ||

4. ప్రయాసపడి భారమును మోసెడు ఓ ప్రజలారా
ప్రభుయేసుక్రీస్తే మీకు విశ్రాంతి నిచ్చునురండి ||ప్రజ||

5. యేసయ్యగాకను వేరే యెవరైన లేరిక రారే
దోషంబులలెల్నను బాపి ఆశీర్వదించునుగాచి ||ప్రజ||

Your favourites

  • No Favourites found!