ప్రార్ధన నేర్పుమయ నా యేసయ్య
ప్రార్ధన నేర్పుమయా
అనుదినము ప్రతిక్షణమూ
నీ ప్రార్ధన నాకు నేర్పించు || ప్రార్ధన ||
1. మోకాళ్ల ప్రార్ధన నేర్పుము తండ్రీ నా యేసయ్య
కన్నీటి ప్రార్థన నేర్పుము తండ్రీ నా యేసయ్య
అందరి కొరకు ప్రార్ధించ నేర్పు
పరిశుద్ధాత్మతో ప్రార్ధించ నేర్పు || ప్రార్ధన ||
2. రూపాంత ప్రార్థన నేర్పుము తండ్రీ నా యేసయ్య
ఏకాంత ప్రార్థన నేర్పుము తండ్రీ నా యేసయ్య
పరిశుద్ధాత్ముడ నా యేసయ్య
కృపగల ప్రార్థన నేర్పుము యేసయ్య || ప్రార్ధన ||
3. ఆసక్తి ప్రార్ధన నేర్పుము తండ్రి నా యేసయ్య
విసుగక ప్రార్ధించ నేర్పుము తండ్రీ నా యేసయ్య
ఎడతెగని ప్రార్ధన నేర్పుము దేవా
ఫలియుంచు ప్రార్ధన నేర్పుము యేసయ్యా || ప్రార్ధన ||
