Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ప్రార్ధన వలనే పయనము ప్రార్ధనే ప్రాకారము Telugu Christian Song Lyrics

ప్రార్ధన వలనే పయనము ప్రార్ధనే ప్రాకారము Lyrics

ప్రార్ధన వలనే పయనము
ప్రార్ధనే ప్రాకారము
ప్రార్ధనే ప్రాధాన్యము
ప్రార్ధన లేనిదే పరాజయం

ప్రభువా ప్రార్ధన నేర్పయ్యా
ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా
నీ పాదాలు తడపకుండా
నా పయనం సాగదయ్యా  || ప్రార్ధన ||

1. ప్రార్ధనలో నాటునది
పెల్లగించుట అసాద్యము
ప్రార్ధనలో పోరాడునది
పొందకపోవుట అసాద్యము  (2)
ప్రార్ధనలో ప్రాకులాడినది –
పతనమవ్వుట అసాద్యము  (2)
ప్రార్ధనలో పదునైనది –
పనిచెయ్యకపోవుట అసాద్యము (2)  || ప్రభువా ||

2. ప్రార్ధనలో కన్నీళ్లు
కరిగిపోవుట అసాద్యము
ప్రార్ధనలో మూలుగునది
మరుగైపోవుట అసాద్యము  (2)
ప్రార్ధనలో నలిగితే –
నష్టపోవుట అసాద్యము  (2)
ప్రార్ధనలో పెనుగులాడితే –
పడిపోవుట అసాద్యము  (2)   || ప్రభువా ||

Your favourites

  • No Favourites found!