Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ప్రార్ధన యేసుని సందర్శన పరమ Telugu Christian Song Lyrics

ప్రార్ధన యేసుని సందర్శన పరమ Lyrics

పల్లవి:
ప్రార్ధన యేసుని సందర్శన - పరమ తండ్రితో సంభాషణ

1.
కరములెత్తి ప్రార్ధించగా - పరమ తండ్రి కౌగిలించును

స్వరమునెత్తి ప్రార్ధించగా - మధుర స్వరముతొ మాటాడును
...ప్రార్ధన...

2.
తండ్రి అని నే పిలువగా - తనయుడా అని తా బల్కును

ఆదుకొనును అన్ని వేళలా - కన్నీరంతయు తుడిచివేయున్
...ప్రార్ధన...

3.
మోకరించి ప్రార్ధించగా - సమీపముగా వేంచేయును

మనవులెల్ల మన్నించును - మహిమతో నలంకారించును
...ప్రార్ధన...

4.
కుటుంబముతో ప్రార్ధించగా - కొదువ ఏమియు లేకుండును

ఐక్యతలో నివసించును - శాశ్వత జీవము అచటుండును
...ప్రార్ధన...

5.
సంఘముగను ప్రార్ధించగా - కూడిన చోటు కంపించును

పరిశుద్ధాత్ముడు దిగివచ్చును - ఆత్మ వరములతో నింపును
...ప్రార్ధన...

6.
ఉపవాసముతో ప్రార్ధించగా - కీడులన్నియు తొలగిపోవును

కొట్లు ధాన్యముతో నింపును - క్రొత్త పానము త్రాగించును
...ప్రార్ధన...

7.
ఏకాంతముగా ప్రార్ధించగా - నీతిని నాకు నేర్పించును

యేసు రూపము నాకిచ్చును - యేసు రాజ్యము నను చేర్చును
...ప్రార్ధన...

Your favourites

  • No Favourites found!