Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ప్రేమా అనే మాయలో చిక్కుకున్న సోదరి Telugu Christian Song Lyrics

ప్రేమా అనే మాయలో చిక్కుకున్న సోదరి Lyrics


ప్రేమా అనే మాయలో చిక్కుకున్న సోదరి
కన్న వారి కలలకు దూరమై
కష్టాల కడలిలో చేరువై (2)          ||ప్రేమా||

తల్లిదండ్రులు కలలు గని
రెక్కలు ముక్కలు చేసుకొని (2)
రక్తము చెమటగా మార్చుకొని
నీ పైన ఆశలు పెట్టుకొని
నిన్ను చదివిస్తే – పట్టణం పంపిస్తే
ప్రేమకు లోబడి – బ్రతుకులో నీవు చెడి – (2)         ||కన్న||

ప్రభు ప్రేమను వదులుకొని
ఈ లోక ఆశలు హత్తుకొని (2)
యేసయ్య క్షమను వలదని
దేవుని పిలుపును కాదని
నీవు జీవిస్తే – తనువు చాలిస్తే
నరకము చేరుకొని – అగ్నిలో కూరుకొని – (2)
కొన్న తండ్రి కలలకు దూరమై
కష్టాల కోడలికి చేరువై (2)          ||ప్రేమా||

Your favourites

  • No Favourites found!