ప్రేమా ప్రేమా - ప్రేమా ప్రియుడవు నీవే - ఆనంద మానందమే
1. నీ ప్రేమ రుచియించిననాడే - నన్ను నేను మరచితినయ్యా
నీ ప్రేమధికమయ్యా - నా పై - నీ ప్రేమధికమయ్యా
2. పరలోక ప్రశస్తరాజా - ప్రేమతో నేతెంచినావా
ప్రేమ తెలియగలనా - నీ ప్రేమ - లోతునెరుగగలనా?
3. ద్రోహినై ఎన్నాళ్ళో నిన్ను - గాంచక తిరిగితినయ్యా
ప్రేమతో నా ప్రియుడా - నన్ను - కౌగిలించితివే
4. ఇహలోక సకల మహిమ - పువ్వులవలె వాడిపోవున్
వాడదే అయ్యా - నీ ప్రేమ - వాడిపోదయ్యా
5. నీ ప్రేమ మాధుర్యమును - వివరింప తరమౌనే నాకు
అతి సులభముగానే - పరమున - వివరించగలను
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ప్రేమా ప్రేమా ప్రేమా ప్రియుడవు నీవే Lyrics
Your favourites
- No Favourites found!
