Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?ఆఆఆ ప్రేమయెతానై Telugu Christian Song Lyrics

ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?ఆఆఆ ప్రేమయెతానై Lyrics

ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?
ఆ-ఆ-ఆ ప్రేమయెతానై నిలచి ప్రేమవాక్కులనే బలికి
ప్రేమతో ప్రాణము బెట్టి ప్రేమనగరికి చనియె ||ప్రేమా||

1. నిశ్చలమైన ప్రేమజీవికి యిలలో తావేది
ప్రేమ ద్రోహులేగాని ప్రియమున చేరరు వాని
చేరిన చెలికాడగురా సమయమిదే పరుగిడరా ||ప్రేమా||

2. ఎంత ఘోరపాపాత్ములనైన ప్రేమించునురారా
పాపభారముతో రారా పాదములపై బడరా
పాపుల రక్షకుడేసు తప్పక నిను రక్షించున్ ||ప్రేమా||

3. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసెదవేల?
రక్షణ దిన మిదియేరా తక్షణమే కనుగొనరా
ఇదియే దేవుని వరము ముదమారగ జేకొనుము ||ప్రేమా||

Your favourites

  • No Favourites found!