ప్రేమసాగరా! ఈ ధరమరణ ఎడారిలోన
దారి తప్పితిన్ నీ మధరు స్వరము వినబడి
నీ దరికి చేరితిన్ - దరికి చేరితిన్
1.శతృవైన సాతాను యుక్తిలోన పడితినాయ్య (2)
ముక్తిదాత యేసుక్రీస్తు శక్తినన్ తప్పించెనయ్యా ||ప్రేమ||
2.చేయరాని పనులు చేసి గాయపరచినాను నిన్ను (2)
చేయకుండా కాని పనులు కాయుమయ్య కరుణజూపి ||ప్రేమ||
3.కన్నతండ్రి ప్రేమ యెరుగకున్న పామరుండనయ్యా (2)
అన్న యేసు సిలువ నాదు కన్నులు వెలిగించెనయ్యా ||ప్రేమ||
4.గుండెలదిరి పోయెనాకు కొండమీద ప్రియునిగాంచి (2)
చిందెయేసు రుధిరము నా బండవంటి హృదయం కరుగ ||ప్రేమ||
5.కాలమెల్ల గడిచిపోయె చాలునింక లోక బ్రతుకు (2)
మేలుకొలుపు కలిగె నీదు జాలి గొలుపు పిలుపు వినగ ||ప్రేమ||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ప్రేమసాగరా! ఈ ధరమరణ ఎడారిలోన దారి Lyrics
Your favourites
- No Favourites found!
