Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము Telugu Christian Song Lyrics

ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము Lyrics

ప్రేమతో యేసు – పిలచుచున్నాడు రమ్ము (2)

రక్షణను పొంది – లక్షణముగా వెళ్ళుము (2) ||ప్రేమతో||


1. పాపమెరుగని ప్రభు నీ కొరకు

పాపముగను చేయబడెను (2)

శాపగ్రాహియాయె సిలువలో

శాపగ్రాహియాయె సిలువలో పరుగిడి రమ్ము (2) ||ప్రేమతో||


2. ముండ్ల కిరీటమును ధరించి

ముఖముపై నుమ్మి వేయబడె (2)

ప్రాణమిడె నేసు సిలువలో

ప్రాణమిడె నేసు సిలువలో పరుగిడి రమ్ము (2) ||ప్రేమతో||


3. సిలువలో నీకై దప్పిగొని

కలుష నీ క్షమకై ప్రార్థించి (2)

సహించి ప్రాణమిడె నీ కొరకు

సహించి ప్రాణమిడె నీ కొరకు పరుగిడి రమ్ము (2) ||ప్రేమతో||


4. తప్పిన గొర్రెను రక్షింప

తనదు రక్తమును చిందించె (2)

కాపరి స్వరము ధ్వనించె

కాపరి స్వరము ధ్వనించె పరుగిడి రమ్ము (2) ||ప్రేమతో||


5. తామసించ తగదిక ప్రియుడా

త్వరపడుము నీ రక్షణ కొరకు (2)

నేడే నీ రక్షణ దినము

నేడే నీ రక్షణ దినము పరుగిడి రమ్ము (2) ||ప్రేమతో||


6. తానే కడుగును తన రక్తముతో

తండ్రివలె నీ పాపమునంత (2)

తనయుడవై పోదు విపుడే

తనయుడవై పోదు విపుడే పరుగిడి రమ్ము (2) ||ప్రేమతో||


7. ప్రేమవార్త ప్రకటింపబడె

ప్రియుడు యేసుని యొద్దకు రమ్ము (2)

కృపాకాలమిదే జాగేల

కృపాకాలమిదే జాగేల పరుగిడి రమ్ము (2) ||ప్రేమతో||

Your favourites

  • No Favourites found!