Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా పరవశిస్తూ Telugu Christian Song Lyrics

ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా పరవశిస్తూ Lyrics

ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా
పరవశిస్తూ ఉంటా నీ సన్నిధిలో నేనయ్యా (2)
చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా
యేసయ్యా నీ సన్నిధి చాలయా (2)        ||ప్రేమిస్తా||

నను ప్రేమించి భువికొచ్చినది నీ ప్రేమ
సిలువలో మరణించి బలియైన ఆ ప్రేమ (2)
ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు
నా జీవమర్పింతు నీ సేవకు (2)          ||చాలయ్యా||

కన్నీటిని తుడిచి ఓదార్చును నీ ప్రేమ
కరములు చాపి కౌగిట చేర్చును ఆ ప్రేమ (2)
ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు
నా జీవమర్పింతు నీ సేవకు (2)          ||చాలయ్యా||

నా స్థితి మార్చి నను రక్షించెను నీ ప్రేమ
నను దీవించి హెచ్చించినది నీ ప్రేమ (2)
ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు
నా జీవమర్పింతు నీ సేవకు (2)          ||చాలయ్యా||

Your favourites

  • No Favourites found!