Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పునరుత్థానుడా నా యేసయ్యా (2) మరణము Telugu Christian Song Lyrics

పునరుత్థానుడా నా యేసయ్యా (2) మరణము Lyrics

పునరుత్థానుడా నా యేసయ్యా (2)
మరణము గెలిచి బ్రతికించితివి నన్ను (2)
స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు
ఆరాధించెద నీలో జీవించుచు (2)

నీ కృప చేతనే నాకు
నీ రక్షణ భాగ్యము కలిగిందనీ (2)
పాడనా… ఊపిరి నాలో ఉన్నంతవరకు (2)
నా విమోచకుడవు నీవేనని
రక్షణానందం నీ ద్వార కలిగిందనీ (2)        ||స్తుతి||

నే ముందెన్నడు వెళ్ళని
తెలియని మార్గం నాకు ఎదురాయెనే (2)
సాగిపో …. నా సన్నిధి తోడుగా వచ్చుననినా (2)
నీ వాగ్ధానమే నన్ను బలపరచెనే
పరిశుద్ధాత్ముని ద్వార నడిపించెనే (2)        ||స్తుతి||

చెరలోనైన స్తుతి పాడుచు
మరణము వరకు నిను ప్రకటించెదా (2)
ప్రాణమా … కృ౦గిపోకే ఇంకొంత కాలం (2)
యేసు మేఘాలపై త్వరగా రానుండగా
నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా (2)        ||స్తుతి||

Your favourites

  • No Favourites found!