Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పుట్టినరోజు శ్రీ యేసురాజు ఈ మహిపాప Telugu Christian Song Lyrics

పుట్టినరోజు శ్రీ యేసురాజు ఈ మహిపాప Lyrics

పుట్టినరోజు శ్రీ యేసురాజు
ఈ మహిపాప పరిహారి మన ప్రేమరాజు – రాజాధిరాజు
1.నాతి మరియమ్మ ఒడిలోన బాలుండుగా – నీతి వెదజల్లు నిజదైవ సూనుండుగా
చిట్టి చిన్నారిగా పొట్టి పొన్నారిగా – చిగురించెను దావీదు వంశాధికారి ||రాజాధిరాజు||
2.ఖ్యాతిగా దూత సంగీత నాదంబులు – ప్రీతి కలిగించు యా గొల్ల మోదంబులు
పూజ లొనరించెగా తేజమనిపించెగా – భూజనంబు మనంబుల ప్రేమాధికారి ||రాజాధిరాజు||
3.పరిమార్చను నీ ఘోర పాపంబులు – తొలగించను లోక విచారంబులు
కరుణా బృందమూ పరమానందమూ – నీ నేరము బాపెడి లోకాధికారి ||రాజాధిరాజు||
4.నీతి స్థాపించు సీయోను పురవాసిగా – పరలోకంబు నేలేటి వేవెల్లుగా
త్వరలో వచ్చె నీ ధరకే తెంచె నీ – మహిమాన్విత పూజిత సర్వాధికారి ||రాజాధిరాజు||

Your favourites

  • No Favourites found!