Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
రాజులకు రాజైన యీ మన విభుని Telugu Christian Song Lyrics

రాజులకు రాజైన యీ మన విభుని Lyrics

రాజులకు రాజైన యీ మన విభుని పూజసేయుటకు రండి యీ
జయశాలి కన్న మన కింక రాజెవ్వరును లేరని ||రాజులకు||

1. కరుణగల సోదరుండై యీయన ధరణి కేతెంచె నయ్యా తిరముగా
నమ్ముకొనిన మన కొసఁగుఁ బరలోక రాజ్యమ్మును ||రాజులకు||

2. నక్కలకు బొరియ లుండె నాకాశ పక్షులకు గూళ్లుండెను ఒక్కింత
స్థలమైనను మన విభుని కెక్కడ లేకుండెను ||రాజులకు||

3. అపహాసములు సేయుచు నాయన యాననము పై నుమియుచుఁ
గృప మాలిన సైనికు లందరును నెపము లెంచుచుఁ గొట్టిరి
||రాజులకు||

4. కరమునం దొక్క రెల్లు పుడకను దిరముగా నునిచి వారల్ ధరణీపతి
శ్రేష్ఠుడా నీకిపుడు దండ మనుచును మ్రొక్కిరి ||రాజులకు||

5. ఇట్టి శ్రమలను బొందిన రక్షకునిఁ బట్టుదలతో నమ్మిన
అట్టహాసముతోడను బరలోక పట్టణంబున జేర్చును ||రాజులకు||

6. శక్తిగల రక్షకుండై మన కొరకు ముక్తి సిద్ధముఁ జేసెను భక్తితోఁ
బ్రార్థించిన మనకొసగు రక్తితో నాముక్తిని ||రాజులకు||

7. త్వరపడి రండి రండి యీ పరమ గురుని యొద్దకు మీరలు దరికిఁ
జేరిన వారిని యీ ప్రభువు దరుమఁ డెన్నడు దూరము ||రాజులకు||

Your favourites

  • No Favourites found!