Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
రాజ్యాలనేలే మహారాజురాజుగా నిన్ను చూడాలని సింహాసనాన్ని Telugu Christian Song Lyrics

రాజ్యాలనేలే మహారాజురాజుగా నిన్ను చూడాలని సింహాసనాన్ని Lyrics

రాజ్యాలనేలే మహారాజు
రాజుగా నిన్ను చూడాలని (2)
సింహాసనాన్ని విడిచి ఇలలో
సామాన్యునిగా అరుదెంచెన్ (2)
హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్ (2)
పావనమాయెను ఈ ధరణి నీ – దివ్య పాదాలు మోపగనే
పాపపు సంకెళ్లు తెగిపోయే అతి – పరిశుద్ధుడు అరుదెంచగనే (2)
చీకటినంత పారద్రోల
పావనుడా పవళించావు
ప్రతి హృదయాన్ని వెలుగుతో నింప
నీతి సూర్యుడా ఉదయించావు ||హ్యాప్పీ||
తారను చూసిన జ్ఞానులు – చేరిరి ప్రభుని చెంతకు
బంగారము సాంబ్రాణి బోళమును – అర్పించిరి భయ భక్తులతో (2)
గొల్లలు జ్ఞానులు పిల్లలు పెద్దలు
పరవిశించిరి నీ రాకతో
ఆనందమాయెను ఈ జగమంతా
రక్షకుడా నీ జన్మతో ||హ్యాప్పీ||

Your favourites

  • No Favourites found!