Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
రారాజు పుట్టాడోయ్ మా రాజు Telugu Christian Song Lyrics

రారాజు పుట్టాడోయ్ మా రాజు Lyrics

రారాజు పుట్టాడోయ్ మా రాజు పుట్టాడోయ్
సూడంగ రారండోయ్ వేడంగ రారండోయ్ (2)
ఈ లోకమునకు రక్షకుడిగ పుట్టినాడండోయ్
మన కొరకు దేవ దేవుడు దిగి వచ్చినాడండోయ్
నింగి నేల పొంగిపోయే…
ఆ తార వెలసి మురిసిపోయే
సంబరమాయెనే, హోయ్…      ||రారాజు||

వెన్నెల వెలుగుల్లో పూసెను సలిమంట
ఊరువాడ వింతబోయే గొల్లల సవ్వడులు
కన్నుల విందుగా దూతలు పాడగా
సందడే సిందేయంగ మిన్నుల పండగ
సుక్కల్లో సంద్రుడల్లే సూడ సక్కనోడంట
పశువుల పాకలోన ఆ పసి బాలుడంట
చెరగని స్నేహమై…..      ||రారాజు||

మచ్చలేని ముత్యమల్లె పొడిసే సూరీడు
మనసులో దీపమై దారి సూపు దేవుడు
ప్రేమ పొంగు సంద్రమల్లె కంటికి రెప్పలా
అందరి తోడునీడై మాయని మమతలా
సల్లంగా సూడ యేసు ఇల వచ్చినాడంట
వరముగ చేర యేసు పరమును వీడెనంట
మరువని బంధమై…..      ||రారాజు||

Your favourites

  • No Favourites found!