Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
రారమ్ము రారమ్ము సాత్వీకుడైన యేసుని యొద్దకు Telugu Christian Song Lyrics

రారమ్ము రారమ్ము సాత్వీకుడైన యేసుని యొద్దకు Lyrics

రారమ్ము రారమ్ము సాత్వీకుడైన యేసుని యొద్దకు రారమ్ము
రారమ్ము - ప్రభుని యొద్ద నేర్చుకొన నేర్చుకొన
1. సర్వమునకు సృష్టికర్త - సర్వాధికారియగు
దేవుని కుడి పార్శ్వమున - నుండి నీతో మాట్లాడును
2. పాపభారము వలన నీవు - కృంగిపోయి ఉంటివా
లోక చింతవలన నీవు - కలవరము కలిగియుంటివా
3. దీనుడవై నీ పాపమును - నేడే ఒప్పుకొనుము
క్రీస్తు నందు విశ్వసించిన - కడుగు తనదు రక్తముతో
4. నీకు ఆయన సమాధాన విశ్రాంతి దయచేయును
నిన్ను పవిత్రునిగ చేసి - నిన్ను తృప్తిపరచును
5. యేసు ప్రభునే వెంబడించుము - నిన్ను విడువడెన్నడు
ప్రభునిచిత్తము నెరవేర్చుచు ఆయననే సేవించుము
6. ప్రభునియందు నిలిచియుండిన - ప్రాపుగ ఫలియింతువు
ప్రభువునకే మహిమ కలుగు - మంచి ఫలముల ఫలియించుము
7. యౌవనజనమా ప్రభుని వాక్యము - విని విధేయత చూపుమా
యౌవన జీవిత మర్పించుటకు యేసు నొద్దకు రారమ్ము


Your favourites

  • No Favourites found!