Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
రావయ్యా యేసయ్యా నా ఇంటికినీ రాకకై Telugu Christian Song Lyrics

రావయ్యా యేసయ్యా నా ఇంటికినీ రాకకై Lyrics

రావయ్యా యేసయ్యా నా ఇంటికి
నీ రాకకై నే వేచియుంటిని…
రావయ్యా యేసయ్యా నా ఇంటికి
నీ రాకకై నే వేచియుంటిని (2)
కన్నులార నిన్ను చూడాలని (2)
కాచుకొని ఉన్నాను వేచి నే ఉన్నాను (2) ||రావయ్యా||
యదార్థ హృదయముతో నడచుకొందును
ఏ దుష్కార్యమును కనుల ఎదుట ఉంచుకొనను (2)
భక్తిహీనుల క్రియలు నాకంటనీయను
మూర్ఖ చిత్తుల నుండి తొలగిపోదును (2) ||రావయ్యా||
దౌష్ట్యము నేనెన్నడు అనుసరింపను
నా పొరుగు వారిని దూషింపను (2)
అహంకారము గర్వము నంటనీయను
నమ్మకస్థునిగా నే నడచుకొందును (2) ||రావయ్యా||
నిర్దోష మార్గముల నడచుకొందును
మోసము నా ఇంట నిలువనీయను (2)
అబద్ధికులెవ్వరిని ఆదరింపను
భక్తిహీనుల మార్గము నే త్రొక్కను (2) ||రావయ్యా||

Your favourites

  • No Favourites found!