Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
రాజా నీ సన్నిధి లోనే దొరికెనే Telugu Christian Song Lyrics

రాజా నీ సన్నిధి లోనే దొరికెనే Lyrics


రాజా నీ సన్నిధి లోనే దొరికెనే ఆనంద మానందమే
జీవజలముతో పోంగె హృదయమే పాడె స్తుతియు స్తోత్రమే
శ్రమలవేళ నీ ధ్యానమే ఆ గానం ఆధారం ఆనందమే
నిలువని శిరులకన్నను క్షయమౌ ప్రేమకన్నను
విలువౌ కృపను పొందగన్ భాగ్యమే
నిలువని శిరులకన్నను క్షయమౌ ప్రేమకన్నను
విలువౌ కృపను పొందతిన్ స్తోత్రమే . .

1. మరలరాని కాలమల్లె తరలి పోయే నాదు దోషం
నిలువదయే పాప శాపాల భారం
నీలో నిలచి ఫలియించు తీగనై
ఆత్మ ఫలము పొందితినే . .

2. తెలియరాని నీదు ప్రేమ నాలో నింపె ఆత్మ ధైర్యం
జీవ జలమై తీర్చెనె ఆత్మ దాహం
నీకై నిలచి ఇలలోన జీవింప
ఆత్మ ఫలము పొందితినే . .

Your favourites

  • No Favourites found!