Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
రాజాధిరాజా రావే రాజు యేసు రాజ్యమేల Telugu Christian Song Lyrics

రాజాధిరాజా రావే రాజు యేసు రాజ్యమేల Lyrics

రాజాధిరాజా రావే - రాజు యేసు రాజ్యమేల రావే
రాజులకు రాజువై రావే - రవికోటి తేజ యేసు రావే
ఓ ... మేఘ వాహనంబు మీద వేగమే
ఓ ... మించు వైభవంబుతోడ వేగమే
1. ఓ ... భూజనంబులెల్ల తేరి చూడగా
ఓ ... నీ జనంబు స్వాగతంబు నీయగా
నీ రాజ్య స్థాపనంబు చేయ - భూరాజులెల్ల గూలిపోవ
భూమియాకాశంబు మారిపోవ - నీ మహాప్రభావమున వేగ
2. ఆ ... ఆకసమున దూతలార్భటింపగా
ఆ ... ఆది భక్త సంఘ సమేతంబుగా
ఆకసంబు మధ్య వీధిలోన - ఏకమై మహాసభచేయ
యేసునాథ! నీదు మహిమలోన - మాకదే మహానందమౌగ
3. ఓ ... పరమ యెరూషలేము పుణ్యసంఘమా !
ఓ ... గొర్రెపిల్ల క్రీస్తు పుణ్యసంఘమా !
పరమదూతలారా ! భక్తులారా ! పౌలపొస్తులారా !
పెద్దలారా ! గొరియపిల్ల యేసురాజు పేర - క్రొత్త గీతమెత్తి పాడరారా


Your favourites

  • No Favourites found!