Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
రాజాధి రాజా రారా రాజులకు రాజువై Telugu Christian Song Lyrics

రాజాధి రాజా రారా రాజులకు రాజువై Lyrics

రాజాధి రాజా రారా రాజులకు రాజువై రారా రాజయేసు రాజ్యమేల
రారా రవికోటితేజ యేసురారా||
ఓ...మేఘ వాహనంబుమీద వేగమే ఓ.. మించు వైభవంబుతోడ వేగమే
||రాజాధి||

1. ఓ...భూజనంబులెల్ల తేరిచూడగా ఓ...నీ జనంబు స్వాగతంబునీయగా
నీ రాజ్యస్థాపనంబుసేయ భూరాజులెల్ల గూలిపోవ భూమియాకసంబు
మారిపోవ నీ మహా ప్రభావమునవేగ ||రాజాధి||

2. ఆ...ఆకసమున దూత లార్భటింపగా ఆ ఆదిభక్త సంఘసమేతంబుగా
ఆకసంబు మధ్యవీధిలోన ఏకమై మహాసభజేయ యేసునాధ! నీదు
మహిమలోన మాకదే మహానందమౌగ ||రాజాధి||

3. ఓ...పరమ యెరుషలేము పుణ్యసంఘమా ఓ...గొఱియపిల్ల క్రీస్తు
పుణ్యసంఘమా పరమదూతలార! భక్తులారా! పౌలపోస్తులారా! పెద్దలారా!
గొఱియపిల్ల యేసురాజుపేర క్రొత్త గీతమెత్తి పాడరారా ||రాజాధి||

Your favourites

  • No Favourites found!