Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
రాజు పుట్టెను రాజు పుట్టెను లోకమంతా Telugu Christian Song Lyrics

రాజు పుట్టెను రాజు పుట్టెను లోకమంతా Lyrics

రాజు పుట్టెను రాజు పుట్టెను
లోకమంతా సందడి ఆయెను (2)
ఊరు వాడా పండుగాయెను (2)
కాంతులతో మెరసిపోయెను (2)
రాజు పుట్టెను మహారాజు పుట్టెను
లోకమంతా సందడి ఆయెను

దూతలు వెళ్లిరి గొల్లలకు తెల్పిరి
లోక రక్షకుడు పుట్టాడని (2)
అంధకారమైన బ్రతుకును మార్చుటకు
చీకటినుండి వెలుగులో నడుపుటకు (2)
రాజు పుట్టెను మహారాజు పుట్టెను
లోకమంతా సందడి ఆయెను            ||రాజు పుట్టెను||

జ్ఞానులు వెళ్లిరి యేసుని చూచిరి
సంతోషముతో ఆరాధించిరి (2)
మన జీవితము మార్చుకొనుటకు
ఇదియే సమయము ఆసన్నమాయెను (2)
రాజు పుట్టెను మహారాజు పుట్టెను
లోకమంతా సందడి ఆయెను            ||రాజు పుట్టెను||

Your favourites

  • No Favourites found!