Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
రాజుల రాజుగ యేసు ప్రభుండు రయమున Telugu Christian Song Lyrics

రాజుల రాజుగ యేసు ప్రభుండు రయమున Lyrics

రాజుల రాజుగ యేసు ప్రభుండు
రయమున రానై యున్నాడు
1. రక్షణాలంకారముతో - తక్షణమే సిద్ధపడి
అక్షయుడగు నా రక్షకుని - నిరీక్షణతో వేడండి
2. మన ప్రభు యేసుని రక్తము - మన పాపములను పోగొట్టి
మన ప్రభురాకడ మనకెంతో - మహిమానదము కలిగించున్
3. మొదట గొఱ్ఱెపిల్ల వలె - నొదిగి వచ్చెను మన ప్రభువు
కొదమసింహముగా వచ్చును - గుండెదిగులు పాపికి
4. గురుతులన్నియు జరుగుచుండ - సరిగా చూడుము విశ్వాసి
త్వరపడుము నీ ప్రభుని జూడ - కరములెత్తి ప్రార్థించు
5. ఎల్లరు క్రీస్తుని రాకను - ఉల్లాసముతో కోరుచు
హల్లెలూయ పాటలు పాడి - ఎల్లప్పుడు స్తుతియించెదము


Your favourites

  • No Favourites found!