Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
రాజులరాజు ప్రభువుల ప్రభూ ఈ జగతికి Telugu Christian Song Lyrics

రాజులరాజు ప్రభువుల ప్రభూ ఈ జగతికి Lyrics

రాజులరాజు - ప్రభువుల ప్రభూ
ఈ జగతికి - అరుదెంచె ప్రభూ
1. ప్రభావంపు దూతలతోడ - ప్రభువేతెంచున్ అగ్ని జ్వాలలలో
ఆ దినమున పవిత్ర జనమున - మహిమాశ్చర్యకరుడగు ప్రభు
2. ప్రభు యేసు తానే స్వర్గమునుండి - ఆర్భాటముతో పిలుచుచు వచ్చున్
ప్రభు జీవితులను మృతులైన వారిని - దేవుని ప్రజలను తనచెంతన్ జేర్చున్
3. ధన్యులు ప్రభుకై జూచెడివారు - మిన్నున ప్రభుతో కలిసి వెళ్ళెదరు
విశ్వాసులను ప్రేమతో ప్రభువు - ఆహ్వానించును తన సన్నిధికి
4. అనంత జీవము నీకిచ్చును - ఘనత మహిమ ప్రభు నీకిచ్చున్
తండ్రితో నిన్ను జేర్చును ప్రభువు - జీవ కిరీటము నీకిచ్చును


Your favourites

  • No Favourites found!