Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
రాకడనే రైలు బండి వస్తున్నది రెండవ Telugu Christian Song Lyrics

రాకడనే రైలు బండి వస్తున్నది రెండవ Lyrics


రాకడనే రైలు బండి వస్తున్నది
రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది (2)
పరిశుద్ధులకందులో చోటున్నది (2)
మంచి చోటున్నది – భలే చోటున్నది
చక్కని సీటున్నది        ||రాకడనే||

సత్యమనే చక్రములు దానికున్నవి
శాంతి అనెడి పైకప్పు దానికున్నది (2)
పాపములను క్షమియించే బ్రేకులున్నవి – బండికి బ్రేకులున్నవి
జీవమునకు మార్గమని కూయుచున్నది – కూత కూయుచున్నది ||రాకడనే||

ప్రతి దినము బైబిలును పఠియించుము
ప్రార్దననెడి విజ్ఞాపన వివరించుము – ప్రభుకి వివరించుము
ఎదురు వీచే గాలులనెడి వ్యాధి బాధలన్
సాతాను చిక్కులను యేసు రక్తమందు కడిగి
జయము పొందుము – పవిత్రుడవు కమ్ము ||రాకడనే||

తండ్రి కుమారాత్మలనే రైలు బండిది
ఇంజను డ్రైవరు పేరు యెహోవాండి (2)
పరిశుద్ధ ఆత్మ అనెడి గార్డు ఉన్నాడు – బండికి గార్డు ఉన్నాడు
సిలువ జెండా ఎత్తి చూపి బండి నిలుపుము – నీవు ప్రవేశించుము       ||రాకడనే||

రక్షణనే టిక్కెట్టు దానికున్నది (2)
మారు మారుమనస్సు పొంది మీరు
ముందుకు రండి – టిక్కెట్టు కొనండి (2)         ||రాకడనే||

పాపులున్న స్టేషనులో బండి ఆగదు (2)
పరిశుద్ధుల స్టేషనులో
బండి ఆగును – రైలు బండి ఆగును (2)         ||రాకడనే||

Your favourites

  • No Favourites found!